akash puri: 'రొమాంటిక్' సినిమాతో కొత్త కథానాయిక పరిచయం

షార్ట్స్‌లో చూడండి
పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కించిన 'మెహబూబా' .. ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేదు. దాంతో తదుపరి సినిమాతో ఆకాశ్ కి తప్పకుండా హిట్ పడాలనే ఉద్దేశంతో, పూరి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాడూరికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'రొమాంటిక్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు.

కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ 'గోవా'లో జరుగుతోంది. ఈ సినిమాలో కథానాయికగా 'కేతిక శర్మ'ను ఎంపిక చేసుకున్నారు. ఈ రోజునే ఈ అమ్మాయి ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని చార్మీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ .. కేతిక శర్మ ఫొటోను షేర్ చేసింది. తెలుగులో ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా ఈ సుందరి కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
akash puri
kethika

More Telugu News