jagan: 'ఏం అలీ... నిన్ను ఎలా చూడమంటావు' అని జగన్ అడిగారు: అలీ

  • కుటుంబసభ్యుడిగా చూడమంటావా? అని అడిగారు
  • వైయస్ సీఎం కాకముందు నుంచి జగన్ నాకు తెలుసు
  • జగన్ ను సీఎం చేయడమే నా లక్ష్యం
వైసీపీ అధినేత జగన్ తో తన పరిచయం ఈ నాటిది కాదని ఆ పార్టీ నేత, సినీ నటుడు అలీ అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచే జగన్ తనకు తెలుసని చెప్పారు. వైయస్ సీఎం కాకముందు ప్రతి రోజు జగన్ ను కలిసేవాడినని తెలిపారు.

తాను జగన్ ను కలిసిన వెంటనే ఆయన తనతో మాట్లాడుతూ... 'ఏం అలీ...నిన్ను ఎలా చూడమంటావు? కుటుంబసభ్యుడిగా చూడనా?' అని అడిగారని అలీ చెప్పారు. దానికి సమాధానంగా... మీరెలా చూడాలనుకుంటున్నారని తాను ప్రశ్నించానని అన్నారు. 'నువ్వు నా కుటుంబ సభ్యుడివి. ఎప్పుడో నీవు వైసీపీలోకి రావాలి. నీవు వస్తావని నేను ఆశించాను. ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. మొత్తానికైతే వచ్చావు. వెల్ కం టు నా ఫ్యాన్ కిందకు. వేసవి ప్రారంభమైంది. ఫ్యాన్ గాలి కింద ఉండు' అని జగన్ అన్నారని చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని అన్నారు.
jagan
ali
ysrcp
tollywood

More Telugu News