గుడ్‌మార్నింగ్‌ హైదరాబాద్‌.... త్వరలో చంచల్‌గూడ జైలు ఖైదీలకు ఎఫ్‌ఎం వినోదం

  • తెలంగాణ జైళ్ల శాఖ నిర్ణయం
  • ప్రయోగాత్మకంగా ఈ జైలు నుంచి ప్రారంభం
  • అవగాహన కార్యక్రమాలు, వినోదం  లక్ష్యం
గుడ్‌మార్నింగ్‌ హైదరాబాద్‌...ఎంఎఫ్‌ రేడియో ఈ మేలుకొలుపు వ్యాఖ్యలు ఇకపై హైదరాబాద్‌ నగర పరిధిలోని చంచల్‌గూడ జైలు పరిసరాల్లో ప్రతిధ్వనించనున్నాయి. ఖైదీలకు వినోదంతోపాటు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు ఎఫ్‌ఎం సేవలు వినియోగించుకోవాలని తెలంగాణ జైళ్ల శాఖ నిర్ణయించింది.

 ‘ఇది జైలు రేడియో గురూ’ అంటూ పలు అంశాలు అందించనున్నారు. ప్రయోగాత్మకంగా చంచల్‌గూడలో ఎఫ్‌ఎం పాఠాలు ప్రారంభించి వినోదంతోపాటు కావాల్సిన సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పర్యవేక్షణాధికారి అర్జునరావు తెలిపారు. ఖైదీలకు కావాల్సిన పెరోల్‌, ఫర్లో, ములాఖత్‌ విషయాలే కాకుండా వారికి జైలు అధికారులు అందించే రెమిషన్‌ లాంటి అదనపు సమాచారం కూడా తెలియజేస్తారు. ఖైదీలు తమ బ్యారక్‌ నుంచే ఈ రేడియో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
chanchalguda prision
FM radio

More Telugu News