pawan kalyan: పవన్ నాకు మంచి మిత్రుడు.. కానీ స్నేహం వేరు, రాజకీయం వేరు: అలీ

  • పవన్ సక్సెస్ అయితే.. నేను కూడా సక్సెస్ అయినట్టు ఫీలవుతా
  • అన్ని పార్టీల్లోని నాయకులు నాకు తెలుసు
  • జగన్ కు చేయూతను అందించేందుకే వైసీపీలో చేరా
దాదాపు అన్ని పార్టీలు తిరిగి చివరకు వైసీపీలో చేరారు ప్రముఖ హాస్య నటుడు అలీ. ఈ ఉదయం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంచి మిత్రుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ప్రశ్న అలీకి మీడియా నుంచి ఎదురైంది. పవన్ కల్యాణ్ ను కాదని వైసీపీలో ఎందుకు చేరారంటూ మీడియా ప్రశ్నించగా... ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని... ఆయన విజయవంతమైతే, తాను కూడా సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతానని అలీ తెలిపారు. స్నేహం వేరు, రాజకీయం వేరు అని అన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న నాయకులంతా తనకు తెలిసినవాళ్లేనని చెప్పారు. ప్రజలంతా జగన్ రావాలి, జగన్ కావాలి అని కోరుకుంటున్నారని... అందుకే ఆయనకు తనవంతు చేయూతను అందిద్దామని వైసీపీలో చేరానని అన్నారు.
pawan kalyan
janasena
ali
jagan
ysrcp
tollywood

More Telugu News