Babu Gogineni: కౌశల్ విషయంలో నాని స్పందించవలసిందే: బాబు గోగినేని

  • కౌశల్ ఆర్మీ ఆరోపణలు
  • ఖండిస్తూ వస్తున్న కౌశల్
  • బాబు గోగినేని అసహనం         
'బిగ్ బాస్ 2' విజేతగా కౌశల్ నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి కౌశల్ ఆర్మీ కొన్ని రోజులుగా కౌశల్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఎప్పటికప్పుడు కౌశల్ ఖండిస్తూ వస్తున్నా .. ఈ ఆరోపణల పర్వానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ నేపథ్యంలో బాబు గోగినేని ఈ విషయంపై మరోమారు స్పందించారు.

'బిగ్ బాస్' హౌస్ లో వున్నప్పుడు బాబు గోగినేనికి .. కౌశల్ కి మధ్య ఒక రేంజ్ లో గొడవలు జరిగేవి. ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. కౌశల్ ధోరణి పట్ల నాని దగ్గర బాబు గోగినేని అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయి. కౌశల్ ఆటతీరును గురించి అభ్యంతరాలను వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయి.

ఆ సమయంలో 'గేమ్ ను గేమ్ లానే ఆడాలి' అంటూ కౌశల్ ను సమర్ధిస్తూ నాని మాట్లాడాడు. తాజాగా బాబు గోగినేని మాట్లాడుతూ .. ప్రస్తుతం కౌశల్ ఆర్మీ గుట్టు రట్టు అయిన విషయాన్ని గురించి ప్రస్తావించారు. గతంలో తన వాదనను కొట్టి పారేస్తూ కౌశల్ ని సమర్థించిన నాని, ప్రస్తుత వివాదంపై వెంటనే స్పందించాలని అన్నారు. నాని స్పందిస్తాడేమో చూడాలి మరి.
Babu Gogineni

More Telugu News