Chandrababu: బీ కేర్‌ఫుల్.. జగన్‌ ఒక్క సీటు గెలిచినా కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మనల్ని అమ్మేస్తారు: చంద్రబాబు

  • తెలుగు జాతిని క్షోభకు గురిచేశారు
  • విభజన గాయం మానకముందే కారం పూస్తున్నారు
  • కేసీఆర్, మోదీలకు జగన్ ఊడిగం
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒక్క సీటు గెలిచినా ప్రమాదమేనని, ఆ సీటుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మనల్ని అమ్మేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ఇది పరీక్షా సమయమని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణతో ఏపీకి ఎంతో అన్యాయం జరిగిందని, నెత్తిన అప్పుతో వచ్చి  రాష్ట్రంలో పడ్డామని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతిని ఎంతో క్షోభకు గురిచేశారని, ప్రజల కోసం పోరాడుతున్న తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

విభజన గాయం మానకముందే కారం పూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని, చంద్రబాబు కావాలో? కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. కేసుల కోసం లాలూచీపడి హైదరాబాద్‌లో కూర్చున్న వారు కావాలో? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వారు కావాలో తేల్చుకోవాలన్నారు.

కేసీఆర్, మోదీలకు ఊడిగం చేసే జగన్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. తనకు రిటర్న్‌గిఫ్ట్ పంపిస్తానన్న కేసీఆర్‌కు వంద గిఫ్టులు పంపిస్తానన్నారు. ఏపీలో జగన్ ఒక్క సీటు గెలిచినా కేసీఆర్ దానిని ఢిల్లీకి తీసుకెళ్లి మనల్ని అమ్మేస్తాడని హెచ్చరించారు.
Chandrababu
Jagan
KCR
Narendra Modi
Andhra Pradesh
YSRCP
Telugudesam
TRS

More Telugu News