Pawan Kalyan: సినిమా హాల్లో జనగణమన వస్తుంటే లేచి నిలబడాలా?: పవన్ కల్యాణ్ ప్రశ్నాస్త్రం
సినిమా హాళ్లలో జాతీయగీతం వస్తుంటే లేచి నిలబడడం తనకు నచ్చని విషయం అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. శనివారం ఆయన ఓ యూత్ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ కాస్త తీవ్రస్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడే సినిమా థియేటర్లు కాస్తా ఇప్పుడు దేశభక్తి నిరూపించుకునేందుకు వేదికలుగా మారాయని విమర్శించారు.
"జాతీయగీతం సినిమాహాళ్లలోనే ఎందుకు ప్లే చేయాలి? రాజకీయనాయకులు తమ సభలకు ముందు జాతీయగీతం ప్లే చేయొచ్చుగా! అలాగైతే కార్యాలయాల్లో కూడా జనగణమన పాడేలా చూడాలి. ఇలా చేయాలి, అలా చేయాలి అని బోధిస్తూ చట్టాలు తీసుకువచ్చే వాళ్లే మొదట ఈ పని చేసి అందరికీ మార్గదర్శకంగా నిలవాలి" అంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్.