Telugudesam: రోజురోజుకీ టీడీపీ గ్రాఫ్ పెరుగుతోంది.. ఏపీలో వన్ సైడ్ ఎన్నికలు జరగబోతున్నాయి: సీఎం చంద్రబాబు

  • ‘మీ భవిష్యత్తు.. నా భరోసా’ అనేదే మా నినాదం
  • ఏపీలో  టీడీపీి తప్ప ఇంకో పార్టీకి ఆస్కారం లేదు
  • కేసీఆర్ డబ్బులు, కుట్రలు నా దగ్గర పనిచేయవు
‘మీ భవిష్యత్తు.. నా భరోసా’ అనేదే ఈ ఎన్నికల్లో తమ నినాదమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోజురోజుకీ టీడీపీ గ్రాఫ్ పెరుగుతోందని, ఈ రాష్ట్రంలో వన్ సైడ్ ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు.

ఎవరైనా హైదరాబాద్ లో కూర్చుని, లోటస్ పాండ్ లో కూర్చుని, తెలంగాణ ఇచ్చిన వెయ్యికోట్లతో లాలూచీ పడిన వాళ్లు సర్వేలు రాసుకుంటే రాసుకోవచ్చు కానీ, ఏపీలో మాత్రం ‘సైకిల్‘, ‘తెలుగుదేశం’ గురించి తప్ప ఇంకో దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు. కేసీఆర్ డబ్బులు, ఆయన కుట్రలు, కుతంత్రాలు పని చేయవని, ఆయన వ్యూహం తెలంగాణలో పనిచేస్తుంది తప్ప, తన దగ్గర కాదని అన్నారు. రాష్ట్ర భవిష్యతు కోరుకునే వారంతా ముందుకు రావాలని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.  
Telugudesam
Andhra Pradesh
kcr
Chandrababu

More Telugu News