c-voter survey: సీ-ఓటర్ సర్వే.. తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, ఆంధ్రాలో టీడీపీ ఆధిక్యం

  • మజ్లిస్ తో కలిసి టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది
  • ఏపీలో ‘సైకిల్’ జోరు ఉంటుంది
  • టీడీపీకి 14 సీట్లు..వైసీపీకి 11 సీట్లు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీలు విజయం సాధిస్తాయన్న విషయాన్ని సీ-ఓటర్ సర్వే వెల్లడించింది. సర్వే వివరాల ప్రకారం.. తెలంగాణలో మజ్లిస్ తో కలిసి టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, టీఆర్ఎస్ కు 16 సీట్లు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని అభిప్రాయపడింది. ఇక, ఏపీలో ‘సైకిల్’ జోరు ఉంటుందని, టీడీపీ ఆధిక్యత కనబరుస్తుందని పేర్కొంది. టీడీపీకు 14 సీట్లు, వైసీపీకు 11 సీట్లు వస్తాయని సీ-ఓటర్ సర్వే తెలిపింది.
c-voter survey
Telangana
Telugudesam
AP
TRS

More Telugu News