Andhra Pradesh: తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లను టీఆర్ఎస్, ఎంఐఎం గెలుచుకుంటాయి: అసదుద్దీన్ ఒవైసీ

  •  ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాలి 
  • కేసీఆర్ చేసిన అభివృద్ధే టీఆర్ఎస్ ను గెలిపిస్తాయి
  • ఏపీ, తెలంగాణలో ఒకే రోజున ఎన్నికలు సంతోషం
తెలంగాణలో అన్ని ఎంపీ సీట్లను టీఆర్ఎస్, ఎంఐఎం గెలుచుకుంటాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంఐఎంతో పొత్తుపెట్టుకున్న టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాల్లో విజయం సాథిస్తుందని, కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధే ఆయన్ని గెలిపిస్తాయని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ఒకే రోజున ఎన్నికలు జరగనుండటం సంతోషకరమైన విషయమని అన్నారు.
Andhra Pradesh
Telangana
mim
Asaduddin Owaisi

More Telugu News