Andhra Pradesh: డబ్బు, మోసం, కులగజ్జి, అరాచకాలతో రాజకీయం చేసేది మీరే చంద్రబాబూ!: విజయసాయిరెడ్డి

  • వైసీపీకి ప్రజాదరణ ఉంది
  • మా పార్టీ డబ్బుపై ఆధారపడదు
  • ట్విట్టర్ లో ఏపీ సీఎంకు కౌంటర్
తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ కు రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాజాగా ఏపీ సీఎం వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి ప్రజాదరణ ఉందనీ, తమ పార్టీ డబ్బుపై ఆధారపడదని స్పష్టం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘డబ్బు, నయవంచన, మోసం, కులగజ్జి, అరాచకాలతో రాజకీయం చేసేది తమరే చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ కు రూ.500 కోట్ల విరాళం, గెలిస్తే మరో 500 కోట్లు తిరిగి ఇవ్వాలన్న కండిషన్ పై నిధులు సమకూర్చింది ఎవరో ప్రజలకు తెలుసు. వైఎస్సార్ కాంగ్రెస్ డబ్బుపై ఆధారపడదు. ప్రజాధరణ ఉన్న పార్టీ మాది’ అని తేల్చిచెప్పారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Vijay Sai Reddy
Telangana
Congress
500 crore

More Telugu News