Tamilnadu: కమలహాసన్ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం!

  • మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన కమల్
  • రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ
  • ఈసీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన నేత
ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమలహాసన్ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 39 స్థానాల నుంచి పోటీ చేస్తామని కమల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కమల్ పార్టీకి 'టార్చ్ లైట్’ గుర్తును కేటాయిస్తున్నట్లు తెలిపింది.

మరోవైపు తమ పార్టీకి ‘టార్చ్ లైట్’ గుర్తును కేటాయించడంపై కమలహాసన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ పార్టీకి సరైన గుర్తు అని వ్యాఖ్యానించారు. తమిళనాడుతో పాటు భారత రాజకీయాల్లో సరికొత్త శకానికి ఎంఎన్ఎం, బ్యాటరీ టార్చ్ నాంది పలుకుతాయని అభిప్రాయపడ్డారు.
Tamilnadu
Kamal Haasan
makkal needi mayyam
battery torch
ec
thanks

More Telugu News