Telangana: రాహుల్ సభకు రేవంత్‌రెడ్డి డుమ్మా.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్

  • శంషాబాద్‌లో రాహుల్ సభ
  • డుమ్మా కొట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు
  • రేవంత్ గైర్హాజరీపై జోరుగా చర్చలు
శంషాబాద్‌లో శనివారం సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన రాహుల్ భారీ బహిరంగ సభలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. రేవంత్ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ సభకు గైర్హాజరు కావడంపై నేతలు చర్చించుకుంటున్నారు. నిజానికి రాహుల్ గాంధీ సభల్లో రేవంత్ ముందు వరుసలో ఉండేవారు. అటువంటి రేవంత్ సభలో కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

ఇక స్వాగత ఉపన్యాసంలో భాగంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతలను ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. అయితే, ఆయనెక్కడా కనిపించకపోవడంతో నాలుక్కరుచుకున్నారు. రేవంత్‌తోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్యలు కూడా సభకు గైర్హాజరయ్యారు. వీరు ముగ్గురు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
Telangana
Revanth Reddy
Rahul Gandhi
Shamshabad
Congress

More Telugu News