India: బంగారం కొనుగోళ్లకు ఇదే మంచి తరుణం... మరో వారం రోజుల పాటు ధరల పతనం!

  • అంతర్జాతీయ విపణిలో పసిడికి ప్రతికూలత
  • నగల వ్యాపారుల నుంచి తగ్గిన డిమాండ్
  • తగ్గుతున్న బంగారం ధర
కొన్నిరోజులుగా పసిడి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోళ్లకు ప్రతికూల పవనాలు వీస్తుండడంతో పాటు స్థానికంగా నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం నాటికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం పది గ్రాముల ధర రూ.33,170 వద్ద స్థిరపడింది. అంతకుముందు బులియన్ ట్రేడింగ్ ఆరంభంలో రూ.33,270 పలికింది.

అదే సమయంలో 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.33,000 పలుకుతోంది. మరో వారం రోజుల పాటు ఇదే సరళి కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు వెండి ధరలో పెరుగుదల కనిపించింది. ఒక కిలోపై రూ.800 పెరగడంతో వెండి ధర రూ.39,100 నుంచి రూ.39,900కి చేరింది.
India
New Delhi

More Telugu News