Andhra Pradesh: ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదు కేసీఆర్!: చంద్రబాబు సెటైర్లు

  • ఏపీలో ప్రతిపక్షమే లేదు
  • అలాంటప్పుడు ఏపీకి  కేసీఆర్ వస్తాననడం విడ్డూరం
  • ఈసారి జరగబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్యే
ఏపీలో ప్రతిపక్షమే లేదని, అలాంటప్పుడు ఏపీకి వస్తాను తేల్చుకుంటానని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ కాదు కేసీఆర్ అని, ‘రండి, పోటీ చేయండి’ అంటూ కేసీఆర్ పై సెటైర్లు విసిరారు. దొంగతనం చేసేవాడు పక్కవాడిని కూడా ఇరికిస్తాడని, జగన్ చేసే పనుల వల్ల రేపు మన పిల్లలూ జైలుకు వెళ్లే పరిస్థితి రావచ్చని విమర్శించారు.

 ఈసారి ఏపీలో జరగబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్యగా అభివర్ణించిన చంద్రబాబు, రాబోయే ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని, అందుకని, ఇక్కడికి వేలకోట్లు పంపించి ఆటలు ఆడుతున్నారని  
ఆరోపించారు. ఏపీలో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల జాబితా కూడా హైదరాబాద్ లోనే తయారు చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు వైసీపీకి ఓటేస్తే కేసీఆర్ కు ఊడిగం చేయాల్సిందేనని అన్నారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
kcr
TRS
Telugudesam
YSRCP
Jagan
Hyderabad

More Telugu News