Andhra Pradesh: కేసీఆర్ ప్రభుత్వం గత ఐదేళ్లలో గ్రామాలకు నయాపైసా కూడా ఇవ్వలేదు!: బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • కేంద్రంపై విమర్శలకు బాబు, కేటీఆర్ పోటీ
  • టీఆర్ఎస్ చక్రం తిప్పుతామనడం హాస్యాస్పదం
  • హైదరాబాద్ లో మీడియాతో బీజేపీ నేత
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నేత కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ పడుతున్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలకు నయా పైసా కూడా విదల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో టీఆర్ఎస్ చక్రం తిప్పబోతోందని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్రం ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆయన దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమనీ, ఇలా పార్టీలు మారినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Andhra Pradesh
BJP
KCR
KTR
TRS
kishan reddy
Chandrababu
Telugudesam

More Telugu News