ఇతర రాష్ట్రాల్లోని ఏపీ వ్యాపారులు, ఉద్యోగస్తులను భయపెడుతున్నారు!: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- ఎన్నికల్లో గెలవలేమన్న భయంతోనే వైసీపీ కుట్ర
- వీటికి బెదిరిపోయే ప్రసక్తే లేదు
- తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల భారతదేశ చరిత్రలో రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ, తెలంగాణ నేతలు వైసీపీని చెప్పుచేతల్లో పెట్టుకుని ఏపీని అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో లక్షల ఓట్లను తొలగించినట్లు ఏపీలో కూడా ప్రజల ఓట్లను తీసేయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబే మరోసారి సీఎం కావాలని స్పష్టం చేశారు.