పాత్రికేయుల బాలాకోట్ సందర్శనను మూడోసారి అడ్డుకున్న పాకిస్థాన్
- మదర్సా, చుట్టుపక్కల ప్రాంతాల సందర్శనకు వెళ్లిన రాయటర్స్ సంస్థ ప్రతినిధులు
- ఎవరినీ వెళ్లనీయడం లేదని చెప్పిన అధికారులు
- సంస్థ ప్రతినిధుల మూడో ప్రయత్నం విఫలం
కానీ పాకిస్థాన్ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. గడచిన తొమ్మిది రోజుల వ్యవధిలో పాత్రికేయులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రయత్నించడం ఇది మూడోసారి. భద్రతాపరమైన సమస్యల కారణంగానే ఈ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదని పాకిస్థాన్ అధికారులు స్పష్టం చేశారు.
వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో పాటు ఇతర కారణాల వల్ల పాక్ సైనిక విభాగం అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని ఈ సందర్శంగా పాత్రికేయులకు తెలియజేశారు. మరికొన్ని రోజుల పాటు ఆ ప్రాంతాన్ని సందర్శించడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు.