Road Accident: ఒంగోలు సమీపంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ... డ్రైవర్, క్లీనర్ మృతి!

  • వెంకటాపురం శివార్లలో గుడిని ఢీకొన్న లారీ
  • మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం తరలింపు 
  • వాహనం బీహార్ కు చెందినదిగా గుర్తింపు 
ఈ తెల్లవారుజామున ఒంగోలు, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరుగగా, ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఒంగోలు వైపునకు వస్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఆంజనేయుని ఆలయాన్ని ఢీకొంది. ఈ ఘటనలో గుడి పూర్తిగా ధ్వంసం కాగా, లారీ డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు.

అద్దంకి మండలం వెంకటాపురం శివార్లలో నేటి తెల్లవారుజామున ఘటన జరుగగా, లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు పోలీసులు స్థానికుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు తమ ప్రాథమిక దర్యాఫ్తులో తేల్చారు. ఈ వాహనం బీహార్ కు చెందినదని గుర్తించిన పోలీసులు, మృతుల వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Road Accident
Ongole
Prakasam District
Lorry
Temple

More Telugu News