Telangana: చంద్రబాబుపై ఎస్సార్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు... స్వీకరించిన టీఎస్ పోలీసులు!

  • తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగింది
  • ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి
  • ఫిర్యాదు చేసిన దినేష్ చౌదరి
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగేలా, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతినేలా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, వచ్చిన ఫిర్యాదును హైదరాబాద్, ఎస్సార్ నగర పోలీసులు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత దినేష్‌ చౌదరి నిన్న స్టేషన్ కు వచ్చి ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదును స్వీకరించామని, న్యాయ సలహాతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, కేసును విచారిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

కాగా, హైదరాబాద్ లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ వ్యవహారం, తమ పౌరుల సమాచారాన్ని దొంగిలించారని ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అటు ఏపీలో కేసీఆర్ పై టీడీపీ నేతలు, ఇటు టీఎస్ లో చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టారు.
Telangana
Andhra Pradesh
Chandrababu
KCR
Complaint
Police

More Telugu News