Posani Krishna Murali: ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా సర్టిఫికేట్ ఇవ్వండి... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై సెన్సార్ బోర్డుకు పోసాని విజ్ఞప్తి

  • సినిమాను బయటకు రానివ్వబోమని అంటున్నారు
  • ఇది వాస్తవంగా జరిగిన కథ
  • వర్మ కూడా జరిగిన వాస్తవాన్నే తీశారన్న పోసాని
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను బయటకు రాకుండా చేస్తారని చాలా మంది చెబుతున్నారని, ఇది వాస్తవంగా జరిగిన కథ కాబట్టి, సెన్సార్ బోర్డు సైతం ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా సర్టిఫికేట్ ఇవ్వాలని నటుడు పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సినిమా ప్రమోషన్ నిమిత్తం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పోసాని, ఈ సినిమాలో ఏ సీన్ ను కట్ చేసినా, దాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, సినిమాకు కట్స్ చెప్పవద్దని అన్నారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న థర్టీ ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, బయోపిక్ అంటే వాస్తవాన్ని చెప్పాల్సిందేనని అన్నారు. నాడు ఏం జరిగిందో నేడు వర్మ అదే చెప్పారని, ఏం చెప్పారన్నది 22న తెలుస్తుందని అన్నారు.
Posani Krishna Murali
Lakshmi's NTR
Movie
Release

More Telugu News