Prahlad Modi: కూకట్ పల్లికి వచ్చిన నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ!

  • మళ్లీ ప్రధాని మోదీయే
  • విపక్షాలన్నీ ఏకమైనా ఆపలేరు
  • విపక్షాలకు ప్రధాని అభ్యర్థి కూడా లేరన్న ప్రహ్లాద్
రానున్న సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి అవే బాధ్యతలను స్వీకరించనున్నారని ఆయన సోదరుడు ప్రహ్లాద్ మోదీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమైనా మోదీకి వచ్చిన ఇబ్బందేమీ ఉండదని, ఎన్డీయే మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. విపక్షాలకు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

కూకట్ పల్లి ప్రాంతంలో బీజేపీ నేత కొరటాల నరేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్థాన్ చెర నుంచి కాపాడటం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. పాకిస్థాన్ పై జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ కు దేశ ప్రజలందరి మద్దతూ లభిస్తోందని ఆయన చెప్పారు.
Prahlad Modi
Narendra Modi
Hyderabad
Kukatpalli

More Telugu News