Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అరుదైన గౌరవం

  • వెంకయ్య సేవలను గుర్తించిన ఐరాస స్థాపిత యూనివర్సిటీ ఆఫ్ పీస్  
  • కోస్టారికాలో గౌరవ డాక్టరేట్ అందుకున్న వెంకయ్య
  • తొలి భారతీయుడిగా రికార్డు

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి విషయంలో ఆయన చేసిన కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ‘యూనివర్సిటీ ఆఫ్ పీస్’ గౌరవ డాక్టరేట్ అందించి గౌరవించింది.

కోస్టారికా రాజధాని శాన్‌జోస్‌లో శుక్రవారం యూనివర్సిటీ డీన్ చేతుల మీదుగా వెంకయ్య ఈ డాక్టరేట్‌ను అందుకున్నారు. ప్రపంచంలోని అతి కొద్ది మందికి మాత్రమే ఈ వర్సిటీ డాక్టరేట్ అందించగా అందులో వెంకయ్య ఒకరు కావడం గమనార్హం. అంతేకాదు, తొలి భారతీయుడు కూడా వెంకయ్య నాయుడే. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత తత్వశాస్త్రం ప్రవచించే వసుధైక కుటుంబం, శాంతి,సామరస్య భావానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన గుర్తింపే ఈ డాక్టరేట్ అని అభివర్ణించారు.

More Telugu News