Visakhapatnam District: విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ అభ్యర్థుల పేర్లు ఖరారు

  • విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు
  • విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్
  • విశాఖ పశ్చిమం నుంచి గణబాబు
  • గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పేర్లు ఖరారు
రాబోయే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబునాయుడు స్పష్టత నిచ్చారు. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ పశ్చిమం నుంచి గణబాబు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం.

విశాఖ ఉత్తరం, భీమిలి, ఎస్.కోట స్థానాలను పెండింగ్ లో ఉంచినట్టు తెలుస్తోంది. కాగా, భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఈ అసెంబ్లీ స్థానానికి మంత్రి నారా లోకేశ్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. విశాఖ ఉత్తరం నుంచి గంటా పోటీ చేసే అవకాశాలున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.
Visakhapatnam District
cm
Chandrababu

More Telugu News