Bihar: బాలికలను రక్షించడానికి వెళ్లిన పోలీసులపై నిందితుల దాడి

  • ఇద్దరు బాలికల కిడ్నాప్
  • నదీ మార్గంలో వస్తున్న పోలీసులపై దాడి
  • ఇల్లు చేరిన బాధిత బాలికలు
ఇద్దరు బాలికలపై అత్యాచారం జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులకు నిందితులు షాక్ ఇచ్చారు. పోలీసులు వస్తున్న సమాచారాన్ని అందుకున్న నిందితులు వారిపైనే దాడి చేసి ఉడాయించారు. బీహార్‌లోని నవడా జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలను దుండగులు కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో హుటాహటిన ఘటనా స్థలానికి పోలీసులు బయలుదేరారు.

ఈ సమాచారం అందుకున్న నిందితులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఓ నదీ మార్గం నుంచి వస్తున్న పోలీసులపై దాడి చేసి పారిపోయారు. గయా పోలీస్ అధికారి రాజీవ్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం... బాధిత బాలికలిద్దరూ ఇంటికి చేరుకున్నారు. దాడి ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Bihar
Navada
Police
Rajiv Misra

More Telugu News