Social Media: నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే రూ.2 కోట్లు ఇస్తా.. థాయ్ మిలియనీర్ బంపర్ ఆఫర్

షార్ట్స్‌లో చూడండి
థాయ్ లాండ్ కు చెందిన అర్డోన్ రొడాంగ్ అనే కోటీశ్వరుడు ఓ సంచలన ప్రకటనతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 58 ఏళ్ల రొడాంగ్ థాయ్ లాండ్ లో ప్రముఖ పండ్ల రైతుగా, వ్యాపారిగా పేరుగాంచాడు. తన కుమార్తెను చేసుకున్న వాళ్లకు రూ.2 కోట్లు ఇస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చాడు. ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందో చూడండి!

"నా కుమార్తె కర్న్ సిటా వయసు 26 సంవత్సరాలు. ఆమెకు ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నా కూతురికి పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూసినా ఆమెకు ఎవరూ నచ్చడంలేదు. అందుకే ఈ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. మీలో ఎవరైనా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే రూ.2 కోట్ల నజరానాతో పాటు నా వ్యాపారంలో భాగస్వామిగా చేసుకుంటాను. అబ్బాయి ఎంత చదివాడన్నది మాకు ముఖ్యంకాదు. కష్టపడే మనిషై ఉండాలి. భార్యను శ్రద్ధగా చూసుకోవాలి. ఏ దేశం వాళ్లయినా నో ప్రాబ్లం... ఆసక్తి ఉంటే సంప్రదించండి" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

సాధారణంగా థాయ్ లాండ్ లో కట్నం ఇచ్చే సంప్రదాయం లేదు. పెళ్లికొడుకే పెళ్లికూతురు తండ్రికి ఎదురు కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సంప్రదాయాన్ని కూడా కాదని తానే కట్నం ఇస్తానంటూ రొడాంగ్ సంచలన ప్రకటన చేశాడు. అయితే ఈ విషయం కర్న్ సిటాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. తండ్రి ఇచ్చిన ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురైంది. మొదట అదో జోక్ అనుకున్నానని, కానీ, తండ్రి సీరియస్ నెస్ చూసిన తర్వాత ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తున్నానని తెలిపింది.
Go Back to Shorts
Social Media

More Telugu News