Vijayasai Reddy: చిట్టి నాయుడికి డోస్ పెంచండి, చంద్రం సార్: విజయసాయిరెడ్డి

  • కాకరేపుతున్న డేటా చోరీ వ్యవహారం
  • అర్థం కాక బుర్ర గోక్కుంటున్న లోకేశ్
  • బైధ్యనాథ్ చ్యవన్ ప్రాస్ డోస్ పెంచాలి
  • లేకుంటే మీ మనవడికి క్లాస్ మేట్ అవుతాడు
తెలుగు రాష్ట్రాల మధ్య డేటా చోరీ వ్యవహారం కాక రేపుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు. తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన ఆయన, "అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటి? అంటూ అర్థం కాక బుర్ర గోక్కుంటున్నాడు. చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్. అలాగే శంకుపుష్టి కూడా తినిపించండి. ఎయిత్ స్టాండర్డులో ఫెయిలయ్యేట్టున్నాడు. లేక పోతే కొన్నాళ్లకు మీ మనవడి క్లాస్ మేట్ అవుతాడు" అన్నారు.

ఆపై మరో ట్వీట్ లో "అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని  చంద్రబాబుకు అర్థమైంది. పవర్ లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారు. ఇటువంటి రుగ్మతను సైకాలజీలో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ గా పిలుస్తారు. తను ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడు" అని విమర్శలు గుప్పించారు.

దాంతో పాటే "ఎన్నికల్లో గెలవాలంటే నిజాయితీగా పనిచేస్తారని విశ్వాసం కలిగించే నాయకత్వం, అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారో చెప్పే మ్యానిఫెస్టో ఉండాలని ఇప్పటి దాకా అంతా అనుకుంటున్నాం. ఈ రెండు అవసరం లేకుండానే డేటా స్కామ్ తో పవర్ లో కొనసాగేందుకు చంద్రబాబు రెండేళ్లుగా ప్లాన్ చేస్తూ వచ్చాడు" అని మరో ట్వీట్ లో సెటైర్ వేశారు. ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.









Vijayasai Reddy
Twitter
Nara Lokesh
Chandrababu

More Telugu News