Hyderabad: హైదరాబాద్ లో నడి రోడ్డుపై నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి!
- సనత్ నగర్ లో ఉదయం 7 గంటల సమయంలో ఘటన
- నిప్పంటించుకున్న వ్యాపారి వెంకటేష్ గుప్తా
- నష్టాలే కారణమని సమాచారం
హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం దారుణం జరిగింది. ఉదయాన్నే ఓ వ్యక్తి నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకుని సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన సనత్ నగర్ లోని స్నేహపురి కాలనీలో ఉదయం 7 గంటల సమయంలో జరిగింది. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వెంకటేష్ గుప్తా అనే వ్యక్తి, ఒంటిపై పెట్రోలు పోసుకుని అంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మరణించాడు.
కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న గుప్తా, తీవ్ర నష్టాలు రావడంతో మనస్తాపంతోనే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఆయన సజీవ దహనమవుతున్న దృశ్యాలు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సజీవ దహనంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.