Challa Ramakrishna Reddy: నేడు మరో చేరిక... వైసీపీలోకి చల్లా రామకృష్ణారెడ్డి!

  • కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్
  • జగన్ సమక్షంలో ఫ్యాన్ కిందకు చల్లా
  • ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నేడు మరో షాక్ తగలనుంది. టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి నేడు హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ సభ్యత్వానికి, చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన, భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వచ్చి పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చల్లా మీడియాకు తెలిపారు.

కాగా, కర్నూలు జిల్లాలో పట్టున్న నేతగా పేరున్న చల్లా రామకృష్ణారెడ్డి గతంలో కోవెలకుంట్ల, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిన తరువాత టీడీపీలో చేరిన ఆయన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీని వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Challa Ramakrishna Reddy
YSRCP
Jagan
Telugudesam

More Telugu News