Dadi Veerabhadra Rao: ఈ నెల 9న వైసీపీలోకి దాడి వీరభద్రరావు!

  • టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరుతారని ప్రచారం
  • కొణతాల టీడీపీలో చేరికతో ఆలోచన విరమణ
  • కుమారుడు రత్నాకర్‌తో కలిసి వైసీపీలో చేరిక
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఆయన టీడీపీలో చేరుతారని.. జనసేనలో చేరుతారని అంటూ ప్రచారం జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి దాడిని కలవడంతో ఆయన జనసేనలోనే చేరుతారని భావించారు.

మరోవైపు టీడీపీలో చేరతారని ఊహాగానాలు బాగా నడిచాయి కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరనుండటంతో దాడి ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తన కుమారుడు రత్నాకర్‌తో కలిసి వైసీపీలో చేరేందుకు తేదీ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 9న జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
Dadi Veerabhadra Rao
Ratnakar
Konathala Ramakrishna
Jagan

More Telugu News