అదే తరహా కుట్ర ఏపీలోనూ జరుగుతోంది: అయ్యన్న పాత్రుడు ఫైర్
- తెలంగాణలో 82 లక్షల ఓట్లు గల్లంతు
- ఏపీలోనూ అదే తరహా కుట్ర
- వైసీపీ వర్గీయులే దరఖాస్తు చేస్తున్నారు
వైసీపీ వర్గీయులే ఏపీ నేతల, కార్యకర్తల ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయంగా ప్రతిపక్ష నేతే ఓట్ల తొలగింపు విషయంపై ఫిర్యాదు చేసినా కూడా ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవట్లేదని అయ్యన్న నిలదీశారు.