Ayyanna Patrudu: అదే తరహా కుట్ర ఏపీలోనూ జరుగుతోంది: అయ్యన్న పాత్రుడు ఫైర్

  • తెలంగాణలో 82 లక్షల ఓట్లు గల్లంతు
  • ఏపీలోనూ అదే తరహా కుట్ర
  • వైసీపీ వర్గీయులే దరఖాస్తు చేస్తున్నారు
అక్రమంగా ఓట్లు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. లేదంటే న్యాయ పోరాటానికి దిగుతామని మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. నేడు విశాఖ జిల్లాలో ఓట్ల తొలగింపు అంశంపై ఎన్నికల ప్రధాన అధికారికి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 82 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని.. అదే తరహా కుట్ర ఏపీలోనూ జరుగుతోందన్నారు.

వైసీపీ వర్గీయులే ఏపీ నేతల, కార్యకర్తల ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు. అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయంగా ప్రతిపక్ష నేతే ఓట్ల తొలగింపు విషయంపై ఫిర్యాదు చేసినా కూడా ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవట్లేదని అయ్యన్న నిలదీశారు.
Ayyanna Patrudu
Visakhapatnam District
YSRCP
EC
Telangana
Andhra Pradesh

More Telugu News