Mahesh Babu: మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెడుతోన్న మహేశ్ బాబు?

షార్ట్స్‌లో చూడండి
 ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళదామని అనుకున్నాడు. 'మహర్షి' పూర్తి కావొస్తున్నా సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో మహేశ్ సంతృప్తి చెందలేకపోయాడు. అందువల్లనే ఆయన నో చెప్పేశాడు. ఈ మధ్యలోనే అనిల్ రావిపూడి ఒక లైన్ చెప్పి ఉండటంతో, ఆయను రంగంలోకి దింపాలనేది మహేశ్ బాబు ఆలోచన.

 అయితే అనిల్ రావిపూడి కూడా మహేశ్ బాబుకి పూర్తి స్క్రిప్ట్ వినిపించి ఓకే అనిపించుకోవలసి వుంది. అది మహేశ్ కి నచ్చకపోతే మళ్లీ కథ మొదటికి వస్తుంది .. తదుపరి ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుంది. మహేశ్ బాబు కూడా ఇదే ఆలోచన చేసినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మహేశ్ బాబు మరో ఇద్దరు దర్శకులను లైన్లో పెడుతున్నాడట. అనిల్ రావిపూడి కథపై పెట్టుకున్న నమ్మకంపై ఏ మాత్రం తేడా వచ్చినా, మరో దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు దర్శకులు ఎవరనేది కూడా మహేశ్ బాబు టీమ్ గోప్యంగా వుంచుతోందట.
Go Back to Shorts
Mahesh Babu

More Telugu News