rafel issue: అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వ్యాఖ్యలపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆగ్రహం

  • అధికార రహస్యాల చట్టం కింద చర్యలు తీసుకుంటామనడంపై గుర్రు
  • బెదిరింపులకు దిగితే సహించమని హెచ్చరిక
  • రాఫెల్‌ వివాదం నేపథ్యంలో రచ్చ
రాఫెల్‌ వివాదం నేపథ్యంలో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతోందని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా నిన్న కోర్టులో వాదనల సందర్భంగా అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై గిల్డ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈ రోజు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మీడియాను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకుంటే సహించమని హెచ్చరించింది.

కోర్టులో విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ మాట్లాడుతూ రక్షణ పత్రాలను అపహరించిన వారిపై అధికార రహస్యాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా ద హిందూతోపాటు ఇతర పత్రికలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను ఎడిటర్స్‌ గిల్డ్‌ తప్పుపట్టింది. తమ ఆధారాలను వెల్లడించాల్సిందిగా ఒత్తిడి చేస్తూ అధికార రహస్యాల చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.
rafel issue
editors gild
atarni genaral

More Telugu News