Jammu And Kashmir: జమ్ములో పేలుడు...18 మందికి తీవ్రగాయాలు

  • పలువురి పరిస్థితి విషమం
  • బస్టాండ్‌లో బస్సుకింద  గ్రేనేడ్‌ అమర్చిన దుండగులు
  • ఉలిక్కిపడిన స్థానికులు
జమ్ములోని బస్టాండ్‌లో గురువారం పేలుడు సంభవించింది. బస్సు కింద అమర్చిన గ్రేనేడ్‌ పేలిన ఘటనలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పుల్వామా దాడి ఘటన మరువక ముందే ఈ సంఘటన జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భద్రతా సిబ్బంది వెంటనే తేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
Jammu And Kashmir
grenede bomb
busstand

More Telugu News