ఐటీ గ్రిడ్స్ కేసులో జోరు పెంచిన సిట్.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన స్టీఫెన్ రవీంద్ర!
- నేడు హైదరాబాద్ లో సమావేశమైన సిట్ అధికారులు
- డేటాను సేకరించేందుకు ఓ టీమ్
- అశోక్ ను పట్టుకునేందుకు మరో బృందం ఏర్పాటు
అలాగే డేటా గ్రిడ్స్ వ్యవహారంలో సాక్షులు, అనుమానితులను విచారించేందుకు మరో బృందాన్ని నియమించారు. చివరిగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ను పట్టుకోవడానికి మరో టీమ్ ను ఏర్పాటు చేశారు.
కాగా, అశోక్ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోవడంతో ఆయన్ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో సమాచారం ఇవ్వాలని గూగుల్, అమెజాన్ సంస్థలకు సిట్ అధికారులు లేఖ రాశారు.