Andhra Pradesh: ఆ 15 నియోజకవర్గాల్లో ఎవరు?.. విశాఖ టీడీపీ నేతలతో నేడు చంద్రబాబు భేటీ!

  • అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేయనున్న అధినేత
  • 3-4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండిచెయ్యి
  • అమరావతికి చేరుకుంటున్న టీడీపీ ముఖ్య నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విశాఖపట్నం నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులకు టికెట్ కేటాయించాలన్న విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో 15 నియోజకవర్గాల నుంచి టీడీపీ ముఖ్యనేతలు అమరావతికి చేరుకుంటున్నారు.

ఈ సమావేశం మరికాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశముందని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈసారి విశాఖ నుంచి ముగ్గురు నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి చూపే అవకాశముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీసీలకు ఈసారి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
Andhra Pradesh
Visakhapatnam District
Telugudesam
15 constitutenxcies

More Telugu News