Karnataka: ఇది మోదీ గొప్పతనం కాదు, కోట్లాది భారతీయులది: ప్రధాని మోదీ

  • భారత్ ని ధైర్యవంతమైన దేశంగా ప్రపంచం చూస్తోంది
  • ఆ గొప్పతనం భారతీయులదే
  • సీఎం కుమారస్వామి కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ 
యావత్తు ప్రపంచం ఈరోజున భారత్ ని ధైర్యవంతమైన దేశంగా చూస్తోందని, ఇది తన గొప్పతనం కాదని, 125 కోట్ల భారతీయలదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని కాలబురిగిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని తాను ప్రయత్నిస్తుంటే, తనను పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పాలనపై ఆయన విమర్శలు చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. బలమైన పార్టీ అధికారంలోకి రావాలే తప్ప, సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకొస్తే ప్రయోజనం శూన్యమని అన్నారు.   
Karnataka
kalaburgi
pm
modi
bjp
cm

More Telugu News