Mahesh Babu: 'మహర్షి' విడుదల తేదీ ఖరారు .. ప్రకటించిన దిల్ రాజు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు .. అశ్వనీదత్ .. నిర్మాతలుగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టు ముందుగా ప్రకటించారు. ఆ తరువాత మే 9వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉందనీ, మహేశ్ బాబును ఒప్పించే ప్రయత్నంలో దిల్ రాజు ఉన్నారనే టాక్ వచ్చింది.

తాజాగా ఇదే తేదీని ఖరారు చేస్తూ .. దిల్ రాజు ప్రకటన చేశారు. ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ పనులను హడావిడిగా చేయించవలసి ఉంటుంది. ఇంతటి భారీ సినిమాను హడావిడిగా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. పైగా ఏప్రిల్లో ఎన్నికల హడావిడి ఉంటుంది కూడా. అందువల్లనే మహేశ్ బాబుతో కూర్చుని మాట్లాడి, ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాము. ఇక నిర్మాతలుగా అశ్వనీదత్ కి .. నాకు కూడా మే నెల బాగా కలిసొచ్చే నెల" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News