jagan: మాకు ఎవరితో పోటీ లేదు.. వాగ్దానాలన్నీ నిజాయతీగా చేస్తాం: వైసీపీ అధినేత జగన్

  • ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మేనిఫెస్టోలో పెడతాం
  • అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటాం
  • మేనిఫెస్టో కమిటీ సమావేశంలో జగన్
వైసీపీ మేనిఫెస్టోలో చేసే వాగ్దానాలన్నీ నిజాయతీగా చేస్తామని ఆ పార్టీ అధినేత జగన్ చెప్పారు. హామీలను ఇవ్వడంలో తమకు ఏ పార్టీతోను పోటీ లేదని తెలిపారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ మేనిఫెస్టోలో పెడతామని... అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మేనిఫెస్టో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా ఉండాలని మేనిఫెస్టో కమిటీకి సూచించారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో జగన్ నేతృత్వంలో ఈరోజు వైసీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. 
jagan
ysrcp
manifesto

More Telugu News