Tamilnadu: బస్సులో భారీగా డబ్బు... ఏపీ సరిహద్దుల్లో పట్టుకున్న తమిళనాడు పోలీసులు!

  • గుమ్మిడిపూండి చెక్ పోస్ట్ వద్ద తమిళనాడు అధికారుల తనిఖీలు
  • ఏపీ నుంచి వచ్చిన బస్సులో రూ. 1.53 కోట్లు
  • నీరజ్ గుప్తా అనే వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్‌ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న రూ. 1.53 కోట్ల డబ్బు ఏపీ సరిహద్దుల్లో అధికారులకు పట్టుబడింది. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి చెందిన తిరువళ్లూరు, కాంచీపురం అధికారులు, గుమ్మిడిపూండి చెక్‌ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, ఓ ప్రైవేటు బస్సులో ఉన్న రెండు సూట్ కేసుల్లో నోట్ల కట్టలు కనిపించాయి. వీటిని బస్సులోనే ఉన్న హైదరాబాద్ కు చెందిన నీరజ్ గుప్తా అనే వ్యక్తివని గుర్తించిన అధికారులు, ఆయన్ను అదుపులోకి తీసుకుని డబ్బును లెక్కించారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ డబ్బు ఎవరైనా పొలిటికల్ లీడర్ కు అందించేందుకు తరలిస్తున్నారా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
Tamilnadu
Border
Andhra Pradesh
Cash
Private Bus

More Telugu News