Telugudesam: తెలుగుదేశంలో చేరబోతున్నా: వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత!
- 9వ తేదీన టీడీపీలో చేరబోతున్నా
- సమస్యల పరిష్కారానికి చంద్రబాబు సహకారం
- మీడియాతో గౌరు చరితా రెడ్డి
తెలుగుదేశం పార్టీలో 9వ తేదీన చేరబోతున్నానని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీ మారనున్నట్టు ఆమె తెలిపారు. దుర్గా బోగేశ్వరంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి, వారి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
ఇదే సమావేశంలో గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పునర్విభజన తరువాత ఓ మారు కాటసాని రాంభూపాల్ రెడ్డిని, మరోసారి చరితను ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. ఎవరు ఎలా పనిచేస్తారో ప్రజలకు తెలిసిందని, రానున్న ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని వారే నిర్ణయించుకుంటారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తమవెంటే ఉన్నారని, 9వ తేదీన కార్యకర్తలు భారీగా తరలిరావాలని అన్నారు.