తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్న రాహుల్.. చేవెళ్లకు కాంగ్రెస్ చీఫ్
- 9న చేవెళ్లలో రాహుల్ భారీ బహిరంగ సభ
- దూకుడు పెంచుతున్న తెలంగాణ కాంగ్రెస్
- టీఆర్ఎస్ కంటే ముందే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం
గతంలోని తప్పులు పునరావృతం కాకూడదని భావిస్తున్న కాంగ్రెస్.. ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడీ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్.. తన పార్టీ విధివిధానాలను ప్రకటించనుంది. రాహుల్ పర్యటన తర్వాత మరింత దూకుడు పెంచాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
రాహుల్ సభ చేవెళ్ల నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అక్కడి సిట్టింగ్ ఎంపీ చూస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది.