Balakrishna: హిందూపురానికి బాలకృష్ణ... రెండు రోజులు అక్కడే మకాం!

  • స్వాగతం పలికిన పార్టీ నేతలు, కార్యకర్తలు
  • పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • ముఖ్య అనుచరులతో సమావేశం
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, నేటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే హిందూపురం చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నేడు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన ముఖ్య అనుచరులు, పార్టీ నేతలతో బాలకృష్ణ సమావేశమవుతారని తెలిపాయి. కాగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలయ్య, మరోసారి హిందూపురం నుంచే పోటీ పడతారా? లేక మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అన్న విషయమై ఇంకా పూర్తి స్పష్టత లభించలేదు.
Balakrishna
Hindupuram
Elections

More Telugu News