India: పాక్ చెప్పేవన్నీ కట్టుకథలే.. !: ఆరోపణలకు దీటుగా బదులిచ్చిన భారత్ నేవీ

  • పాక్ బుద్ధి తెలిసిందే!
  • ఇలాంటి ప్రచారం కొత్తకాదు
  • భారత నేవీ స్పందన
"మా ప్రాదేశిక జలాల్లో చొరబాటుకు యత్నించిన భారత జలాంతర్గామిని తరిమికొట్టాం" అంటూ పాకిస్థాన్ నేవీ ప్రకటించిన కొద్దిసేపటికే భారత్ దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్ కు కట్టుకథలు చెప్పడం అలవాటేనని, గతంలో ఎన్నోసార్లు పాకిస్థాన్ ఇలాంటి దుష్ప్రచారం చేసిందనడానికి ఆధారాలున్నాయని భారత నేవీ ఆరోపించింది. తప్పుడు సమాచారంతో అర్థంలేని ఆరోపణలు చేయడం పాక్ కు కొత్తేమీ కాదని ఓ ప్రకటనలో విమర్శించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోనేందుకు భారత నావికాదళం సన్నద్ధంగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారత సముద్ర జలాల పరిరక్షణకు భారత నేవీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు.
India
Pakistan

More Telugu News