bjp: భారతీయ జనతా పార్టీ వెబ్ సైట్ హ్యాకింగ్..మోదీపై హ్యాకర్స్ సెటైర్లు

  • హ్యాక్ చేసినట్టు ఏ సంస్థ ప్రకటించని వైనం
  • బీజేపీ వెబ్ సైట్ నిలిపివేత
  • ప్రధాని మోదీపై సెటైర్లు వేస్తూ ‘మీమ్స్’ పోస్ట్
భారతీయ జనతా పార్టీ వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైంది. హ్యాకర్లు ప్రధాని మోదీపై సెటైర్లు వేస్తూ మీమ్స్ పోస్ట్ చేశారు. అయితే, బీజేపీ వెబ్ సైట్  హ్యాకింగ్ కు తామే బాధ్యులమని ఏ సంస్థ ఇంత వరకూ ప్రకటించలేదు. తమ వెబ్ సైట్ హ్యాక్ అయినట్టు గుర్తించగానే బీజేపీ దానిని నిలిపివేసింది. అయితే, తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్టు బీజేపీ ప్రకటించకపోవడం గమనార్హం. కాగా, నెటిజన్లు స్పందిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ లు చేశారు. మోదీని కించపరిచేలా హ్యాకర్లు పెట్టిన ‘మీమ్స్’ను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. 
bjp
modi
netzens
website

More Telugu News