Andhra Pradesh: టీడీపీలోకి వలసలు.. అధికార పార్టీలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు!

  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న సీతారాం, మంగపతిరావు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • ఇద్దరు నేతలను తీసుకొచ్చిన మంత్రి పితాని
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, మాడుగుల మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావు ఈరోజు అమరావతిలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకున్నారు.

ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ వీరిని తీసుకుని ఉండవల్లిలోని ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరేందుకు వీరద్దరూ ఆసక్తి చూపడంతో చంద్రబాబు అనుకూలంగా స్పందించారు. సీతారాంతో పాటు మంగపతిరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, ఈ సందర్భంగా సీతారాం, మంగపతిరావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Telugudesam
TWOMLAS
JOIN
pitani

More Telugu News