india: భారత్ కు ప్రాధాన్యత హోదాను తొలగించే యోచనలో అమెరికా

షార్ట్స్‌లో చూడండి
సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ కింద అమెరికా మార్కెట్లో భారత్ కు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నప్పటికీ... తమకు భారత్ అలాంటి సదుపాయాలు కల్పించడం లేదని అమెరికా అసహనం వ్యక్తం చేసింది. భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువులపై అధిక సుంకాలను విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు.

ఎలాంటి సుంకాలు లేకుండా అమెరికాకు కొన్ని వస్తువులను ఎగుమతి చేసేందుకు వీలుగా భారత్ కు ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని భావిస్తున్నారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు లేఖ ద్వారా ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.

ప్రాధాన్య వాణిజ్య హోదా ద్వారా అమెరికా మార్కెట్లోకి భారత్ ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఆ హోదాను తొలగిస్తే అన్ని వస్తువులపై సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది.
Go Back to Shorts
india
us
america
trump

More Telugu News