Andhra Pradesh: ‘డేటా కుంభకోణం’పై విచారణ చేస్తే పిల్లకాకి లోకేశ్ కు భయమెందుకు!: వైసీపీ నేత బొత్స

  • సూత్రధారులు బయటపడతారనే భయపడుతున్నారు
  • ఏ తప్పూ చేయకుంటే విచారణను ఎదుర్కోండి 
  • టీడీపీ అధినేత, లోకేశ్ పై విమర్శలు గుప్పించిన నేత
డేటా దొంగతనం కుంభకోణంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నారా లోకేశ్ ను ఈ సందర్భంగా పిల్లకాకిగా ఆయన అభివర్ణించారు. అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనే లోకేశ్ భయపడుతున్నారని ఆరోపించారు. ఏ తప్పూ చేయకుంటే చంద్రబాబు, లోకేశ్ ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని సవాలు విసిరారు.

ఈరోజు ట్విట్టర్ లో బొత్స స్పందిస్తూ..‘డేటా దొంగతనం స్కాం పై విచారణ చేస్తే.. పిల్లకాకి @naralokesh కి అంత భయమెందుకో? అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనా? ఏ తప్పూ చేయనప్పుడు విచారణను ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా? దొంగతనం చేసి పచ్చిగా పట్టుబడింది కాక దొంగే "దొంగా.. దొంగా" అంటూ తండ్రీకొడుకులు భుజాలు తడుముకుంటున్నారు?’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Nara Lokesh
YSRCP
Botsa Satyanarayana
Twitter

More Telugu News