Mahesh Babu: సుకుమార్ చెప్పిన కొత్త లైన్ .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మహేశ్ బాబు

  • 'మహర్షి' షూటింగులో మహేశ్ 
  • తదుపరి సినిమా అనిల్ రావిపూడితో
  • లైన్లోకి వచ్చిన సుకుమార్  
'రంగస్థలం' సినిమాతో చరణ్ కి భారీ విజయాన్ని అందించిన సుకుమార్, తన తదుపరి సినిమాను మహేశ్ తో చేయాలనే ఉద్దేశంతో ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ కథ మహేశ్ బాబుకు అంతగా నచ్చలేదు. మరో కథను తయారు చేయడానికి సుకుమార్ కొంత సమయాన్ని తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడితో చేయడానికి మహేశ్ బాబు ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లో ఆయన తీరికలేకుండా వున్నాడు.

ఈ నేపథ్యంలోనే నిన్న మహేశ్ బాబును కలిసి సుకుమార్ ఒక లైన్ చెప్పాడట. తనకి బాగా నచ్చేసిందని చెప్పి .. పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయమని అన్నాడని సమాచారం. ఇంతవరకూ తానెప్పుడూ రెండు సినిమాలను సమాంతరంగా చేయలేదనీ, వీలైతే అనిల్ రావిపూడి సినిమాతో పాటు .. ఈ సినిమా కూడా చేసేస్తానని మహేశ్ బాబు అన్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
Mahesh Babu
sukumar
anil ravipoodi

More Telugu News